కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అహంకారానికి ప్రజల ఆత్మగౌరవానికి మధ్య పోరు
నిరసన మెట్ల అశోక్ తెలంగాణ మలిదశ ఉద్యమ విద్యార్థి నేత టిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి కొండమల్లేపల్లి అక్టోబర్ 30 జనం సాక్షి : మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలం టిపి గౌరారం ఎంపీటీసీ పరిధి ఇంచార్జ్ ఎమ్మెల్సీ ఎం సి కోటిరెడ్డి గారి ఆదేశాలనుసారం నిరసన మెట్ల అశోక్ తెలంగాణ మలిదశ ఉద్యమ విద్యార్థి నేత టిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి పోలింగ్ బ్యాలెట్ నమూనా తో మాక్ పోలింగ్ నిర్వహించి టిఆర్ఎస్ బలపర్చిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి బాటలు వేయాలన్నారు ఆయన మాట్లాడుతూ భభారత రాష్ట్ర సమితి టిఆర్ఎస్ ను చూసి బిజెపి భయపడుతుందని పేర్కొన్నారు జాతీయ రాజకీయాల నుంచి సీఎం కేసీఆర్ దృష్టి మరల్చేందుకే బిజెపి మునుగోడు ఉప ఎన్నిక తెచ్చిందని అన్నారు ఇది రాజగోపాల్ రెడ్డి అహంకారం ధన దాహానికి ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటమని చెప్పారు రాజగోపాల్ రెడ్డి రూ. 18వేల కోట్ల కాంట్రాక్ట్ కోసం రాజీనామా చేశారని చెప్పారు.రాజగోపాల్ రెడ్డి తన స్వార్థం కోసం రాజీనామా చేస్తే ప్రజలు ఎందుకు బలి కావాలని ప్రశ్నించారు.వ్యక్తి ప్రయోజనం ముఖ్యమా వ్యవస్థ ముఖ్యమా అనేది ప్రజలు ఆలోచించాలని కోరారు. కాబట్టి టిఆర్ఎస్ బలపరిచిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కార్ గుర్తుకు ఓటు వేసి నియోజకవర్గ అభివృద్ధికి భాగస్వాములు కావాలని tp గౌరారం గ్రామ ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శులు బేగరి కిరణ్ గెల్వాల్ రెడ్డి గ్రామ ఇన్చార్జులు టిఆర్ఎస్వి జిల్లా నాయకులు ఉప సర్పంచ్ ఆడెపు లింగయ్య ఎండి సుభాన్ రమేష్ యాదవ్ కొమ్ము సైదులు నరేష్ శ్రీకాంత్ కుమార్ తదితరులు ఉన్నారు
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అహంకారానికి ప్రజల ఆత్మగౌరవానికి మధ్య పోరు




