కోయగూడెం ఉపరితల గని లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహణ
టేకులపల్లి, నవంబర్ 26( జనం సాక్షి ): కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు అన్ని ఏరియాలలోని డిపార్ట్మెంట్స్& గనులలో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించాలని ఆదేశాల ప్రకారం గాను ఇల్లందు ఏరియా జి.ఎం. ఎం. షాలెం రాజు పర్యవేక్షణలో ఇల్లందు ఏరియాలోని కోయగూడెం ఉపరితల గనిలో శనివారం కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజ్యాంగం యొక్క అవశ్యకతను తెలియజేస్తూ ప్రపంచంలో ఉన్న అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనదేనని, మాన రాజ్యాంగాన్ని రూపొందించడానికి 1947 లో ముసాయిదా కమిటీ ఏర్పడిందని,దీనికి బిఆర్ అంబేద్కర్ అధ్యక్షులుగా ఉన్నారని,మన రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్8 షెడ్యూల్స్22 భాగాలు ఉన్నాయని అన్నారు. మన భారత రాజ్యాంగం 26 జనవరి 1950 న అమల్లోకి వచ్చిందని తెలియజేస్తూ ఉద్యోగుల౦దరిచే రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కే ఓ సి మేనేజర్ సౌరబ్ సుమన్,సేఫ్టీ ఆఫీసర్ కే యస్ న్ రాజు, సీనియర్ పర్సనల్ అధికారి పి.కృష్ణ, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు




