టేకులపల్లి, మే 1( జనం సాక్షి ): ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ పుట్టినరోజు సందర్భంగా టేకులపల్లి మండలంలోని పెగళ్లపాడు గ్రామపంచాయతీలో కోరం శ్రీకాంత్ ఆధ్వర్యంలో సోమవారం యూత్ ఆధ్వర్యంలో పడమటి గుంపు చౌరస్తాలో కేక్ కట్ చేసి ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అనంతరం సులానగర్ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పేషంట్లకు పండ్లు, బ్రెడ్ పంచి పెట్టారు. ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు వరప్రసాద్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బోడ బాలు నాయక్, యువజన నాయకులు బర్మవత్ శివకృష్ణ, పార్టీ మండల ఉపాధ్యక్షులు చీమల సత్యనారాయణ,జయరాజు, గురు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.




