హుజూర్ నగర్ మే 1 (జనం సాక్షి): కష్టం విలువ కార్మికుల విలువ తెలిసిన గొప్ప నాయకులు సీఎం కేసీఆర్ అని హుజూర్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సోమవారం
హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో బిఆర్ఎస్ కేవీ జెండావిష్కరించిన అనంతరం బిఆర్ఎస్ కెవి అనుబంధ యునియన్ లతో స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మేడే సందర్భంగా ట్రాక్టర్ ను, ఆటోను ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి నడిపారు. ఈ సందర్భంగా
ఎమ్మెల్యే శానంపుడి సైదిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల విలువ తెలిసిన గొప్ప నాయకులు సీఎం కేసీఆర్ అని అందుకోసమే కులవృత్తుల చేసే కార్మికులకు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే రజక సోదరులకు, నాయి బ్రాహ్మణులకు, కొన్ని యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తు కుల వృత్తులను ప్రోత్సహిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలోనే రాజ్యాంగ సృష్టికర్త బి.ఆర్ అంబేద్కర్ ని ఘనంగా తెలంగాణలో స్మరించుకునేలా అత్యంత హంగులతో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే జరిగాయి. కొన్ని పార్టీలు కులాలని, మతాలని విడదీసి పంచాయతీ పెట్టాలి అనే రాజకీయ దురుద్దేశంతో కొనసాగుతున్నాయి అన్నారు. అన్ని వర్గాలు కలిసి ఉండాలని అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరగాలని ఎప్పుడూ ఆశించి ఆకాంక్షించే గొప్ప నాయకులు సీఎం కేసీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ కెవి నియోజకవర్గ అధ్యక్షులు పచ్చిపాల ఉపేందర్, మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లీ అర్చనరవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరావు, బిఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షులు చిట్యాల అమర్నాథ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అమర్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, వార్డ్ కౌన్సిలర్లు, ట
బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




