Monday, 2 November 2026

11వ వేజ్ బోర్డు చర్చల్లో కాంట్రాక్టు కార్మికులకు ప్ర త్యేకవేతన ఒప్పందాన్ని చేయాలి

11వ వేజ్ బోర్డు చర్చల్లో కాంట్రాక్టు కార్మికులకు ప్ర త్యేకవేతన ఒప్పందాన్ని చేయాలి
* డిమాండ్ బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరైన కార్మికులు
* ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి డి ప్రసాద్ డిమాండ్

టేకులపల్లి, జనవరి 1( జనం సాక్షి ): 11వ వేజ్ బోర్డు చర్చల్లో కాంట్రాక్టు కార్మికులకు ప్రత్యేక వేతన ఒప్పందాన్ని చేయాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియ న్ (SCCWU-IFTU) రాష్ట్రకమిటీ పిలుపుమేరకు ఆదివారం కార్మికులు డిమాండ్ బ్యాడ్జిలు ధరించుకొని విధులకు హాజరయ్యా రు. హైటెక్ కాలనీలో కాంట్రాక్టు కార్మికుల సమామవేశం జరిగింది. ఈసమావేశంలో ఐఎఫ్టియు జిల్లా ప్రధానకార్యదర్శి డి ప్రసాద్ పాల్గొనిమాట్లా డుతూ కలకత్తాలో జనవరి మూడో తేదీన 11వ వేతనఒప్పందంచర్చలు జరగనున్నాయి. ఈచర్చల్లో సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు 2013 నుండి హెచ్పిసి వేతనాలు ఒప్పందం చేసుకుని అమలుచేయకుండా మొండికేస్తున్న యాజమాన్యం మీద ఈచర్చలలోఒత్తిడిచేసి పెరిగిన ఒప్పందం ఏరియర్స్ ఇచ్చేవిధంగా ఒత్తిడి తేవాలని జేబీసీసీఐ సంఘాలనుకోరారు. మొదటి కేటగిరివేత నం, సుప్రీంకోర్టు తీర్పుప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు కోరకు చర్చలలో చర్చించి అవసరమైతే పర్మినెంట్ కార్మికుల వేతన ఒప్పందం మీద సంతకంచేయకుండా యాజమాన్యంమీద ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగులకు, కాంట్రాక్ట్కార్మికు లకు 30 శాతంజీతాలు పెంచారన్నారు.కానీ సింగరేణి అధికారులు జీవో నెంబర్ 60 అమలుకు సమయం కావాలని మోసం చేశారన్నారు.సమ్మె చేయించిన సంఘాలు వెన్నుపోటు పొడిచాయన్నారు. దీనివల్ల
కాంట్రాక్ట్ కార్మికులు వంచనకు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని అన్నారు.కాంట్రాక్టు కార్మికులజీ తాలు మాత్రం పెరగడంలేదు. గత అనేక వేజుబోర్డు చర్చల సమయాలలో ఐఎఫ్టియ