హైదరాబాద్,జూన్8(జనం సాక్షి ): అక్రమాస్తుల కేసులో వైసిపి చీఫ్ జగన్ శుక్రవారం సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. జగన్‌తో పాటు వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఎఎస్ అధికారిణి శ్రీలక్ష్మి తదితరులు కూడా కోర్టుకు హాజరయ్యారు. ఒఎంసి కేసులో గాలి జనార్ధన్‌రెడ్డి, సబితాఇంద్రారెడ్డి, శ్రీలక్ష్మి కోర్టుకు హాజరయ్యారు. ఒఎంసి కేసు విచారణను ఈనెల 30వ తేదీకి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.
కోర్టుకు హాజరైన జగన్




