నంద్యాల: రాష్ట్రంలో 29 కోర్టులకు కొత్త భవనాలను నిర్మించేందుకు రూ.176 కోట్లు మంజూరైనట్లు
రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి తెలియజేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో
ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా రూ. 16 కోట్లతో నంద్యాలలోని 8 కోర్టుల
కాంప్లెక్స్ నూతన భవనం, సిద్థపేటలో రూ. 4 కోట్లతో కోర్టు కాంప్లెక్స్‌లకు త్వరలోనే భూమి పూజ
చేయనున్నట్లు తెలియజేశారు.




