కోర్టు భవన సముదాయాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం హుజూర్ నగర్ జనవరి 10 (జనం సాక్షి): హుజూర్ నగర్ కోర్టు భవన సముదాయాన్ని సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి గౌతమ్ ప్రసాద్ మంగళవారం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక సీనియర్, జూనియర్ సివిల్ జడ్జిలు జిట్టా శ్యాం కుమార్, సాకేత్ మిత్ర లను అడిగి పలు విషయాలు తెలుసుకున్నారు. ఆర్ అండ్ బి అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. నూతనంగా మంజూరైన అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు సంబంధించి నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్ అండ్ బి అధికారులను, కాంట్రాక్టర్ ను ఆదేశించారు. నూతన జిల్లా కోర్టును హుజూర్ నగర్ లో త్వరలోనే ప్రారంభించనున్నామని ఈ సందర్భంగా తెలిపారు. కోర్టు భవన సముదాయాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి లు, అధికార ప్రతినిధి సాముల రాంరెడ్డి, జక్కుల నాగేశ్వరరావు, కాల్వ శ్రీనివాసరావు, న్యాయవాదులు నట్టే సత్యనారాయణ, అంబటి శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, రమణారెడ్డి, మీసాల అంజయ్య, వట్టికూటి అంజయ్య, సైదా హుస్సేన్, వెంకయ్య, జక్కుల వీరయ్య, రామినేని వెంకటేశ్వర్లు, ఎం.ఎస్.రాఘవరావు, చక్రాల వెంకటేశ్వర్లు, వెంకటరెడ్డి, లతీఫ్, ఏ.జి.పి. ఉప్పల గోపాలకృష్ణమూర్తి, అడిషనల్ పి.పి. శ్రీనివాస్, నరేష్, పసుపులేటి వీరయ్య, జక్కుల నవీన్, కుక్కడపు నరసింహారావు, నారాయణరెడ్డి, కోర్టు సూపరింటెండెంట్లు తాటి విజయభాస్కర్ రెడ్డి, సైదా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
కోర్టు భవన సముదాయాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం




