కోల్‌కతాలో సచిన్‌ జన్మదిన వేడుకలు

కోల్‌కతా: మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ జన్మదిన వేడుకలు కోల్‌కాతాలో బుదవారం ఘనంగా జరిగాయి. సచిన్‌ భార్య అంజలితో కలిసి కేక్‌ కట్‌ చేశాడు. ఇవాళ్టితో 41వ పడిలో అడుగుపెట్టిన మాస్టర్‌.. ఐపీఎల్‌లో భాగంగా ఇవాళ నైట్‌రైడర్స్‌తో  మ్యాచ్‌ కోసం కోల్‌కతాలో ఉన్నాడు. ఈ సందర్భంగా సచిన్‌ అభిమానులకు కృతజ్ఞలు తెలిపాడు. ఈ రోజు సాయంత్రం మ్యాచ్‌కు ముందు కూడా సచిన్‌ స్పెషల్‌ కేక్‌ కట్‌  చేయన్నాడు,  దీనికోసం  క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా 40 ఏళ్ల వయసుకు గుర్తుగా సచిన్‌ 40 కిలోల కేక్‌ కట్‌ చేయనున్నాడు.