Monday, 2 November 2026

కోళ్ల పరిశ్రమలో మనమే నెంబర్‌వన్‌సీఎం కేసీఆర్‌

7

హైదరాబాద్‌, నవంబర్‌ 26 (జనంసాక్షి) : కోళ్ళ పరిశ్రమల అభివృద్ధిలో తెెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. హైటెక్స్‌లో ఏర్పాటుచేసిన పౌల్ట్రీ ఎక్స్‌పో-2014ను సీఎం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో సీఎం మాట్లాడుతూ పౌలీ పరిశ్రమకు ప్రోత్సాహకాల కల్పనకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. బ్జడెట్‌లో పౌల్టీ రంగానికి రూ.90 కోట్ల నుంచి 220 కోట్లకు నిధులు పెంచామని వివరించారు. ఐసీడీఎస్‌ కేంద్రాలకు గుడ్ల పంపిణీని 3 నుంచి 5.25 కోట్లకు పెంచామని వెల్లడించారు. తెలంగాణలో కోళ్ల పరిశ్రమకు అపారమైన అవకాశాలున్న దృష్ట్యా దేశవ్యాప్తంగా పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు రాష్టాన్రికి రావాలని కోరారు. అమెరికా నుంచి కోళ్ల కాళ్ల దిగుమతులపై నియంత్రణ పాటించాలని సీఎం కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కోళ్ళ పరిశ్రమ అనూహ్యంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర మంత్రి సంజీవ్‌కుమార్‌ తెలిపారు. 12వ పంచవర్ష ప్రణాళికలో కోళ్ల పరిశ్రమ అభివృద్ధి కోసం రూ.2,800కోట్లు కేటాయించామన్నారు. రాష్ట్రమంత్రులు ఈటెల రాజేందర్‌, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *