క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా రాంచందర్ నాయక్
టేకులపల్లి, జనవరి 11( జనం సాక్షి): ఏజెన్సీ పరిరక్షణ కమిటీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి నివాసి బోడ రామ్ చందర్ నాయక్ ను క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ప్రకటిస్తూ ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు లాల్ సింగ్ నాయక్ బుధవారం ఉత్తర్వులు జారీ చేస్తూ నియామక పత్రం అందించారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్తిగా గిరిజనులు నివసిస్తున్న ఏజెన్సీ ప్రాంతమని అట్టి ఏజెన్సీ ప్రాంతంలో ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా అనేక కార్యకలాపాలు జరుగుతున్నాయని, ఏజెన్సీ లో ఉన్నటువంటి గిరిజనుల హక్కులు కాలరాస్తున్న వారిపై, జిల్లాలో ఏజెన్సీ చట్టాన్ని పకడ్బందీగా అమలు అయ్యేలా దశలవారీగా కార్యక్రమాలు చేస్తూ అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని చట్టాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వ్యవస్థాపద్యక్షులు లాల్ సింగ్ నాయక్ పిలుపునిచ్చారు. రామచంద్రనాయక్ సుదీర్ఘ రాజకీయ అనుభవాలు కలిగి ఉండి ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి సీనియర్ నాయకులు తమ కమిటీలో రావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఎన్నికైనటువంటి రామ్ చందర్ నాయక్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు ఇచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు మాలోత్ అశోక్ బాబుకి,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భూక్య రవి నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు మాలోత్ శివ,జిల్లా కన్వీనర్ వేణుగోపాల్ కి తన నియామకానికి సహకరించినటువంటి కమిటీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జిల్లాలో ఏజెన్సీ సమస్యలపై పూర్తి స్థాయిలో కమిటీలు నిర్మాణం చేసుకొని మేధావులను కలుపుకుని ఏజెన్సీ హక్కులపై అదేవిధంగా ఏజెన్సీ ప్రజల సమస్యలపై నిరంతరం ఉద్యమిస్తూ ఏజెన్సీ చట్టాలను పరిరక్షించేందుకు నిరంతరం కృషి చేస్తానని, తనకి పదవ




