Thursday, 5 November 2026

యువత లాల్ బహుదూర్ శాస్త్రిని ఆదర్శంగా

యువత లాల్ బహుదూర్ శాస్త్రిని ఆదర్శంగా తీసుకోవాలి :శామీర్ పేట్, జనంసాక్షి :బుధవారం శామీర్ పేట లో కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ స్వాతంత్ర్య సమర యోధులు,భారత దేశ రెండవ ప్రధానమంత్రి గా బాధ్యతలు చేపట్టిన లాల్ బహదూర్ శాస్త్రి 57 వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్ మాట్లాడుతు.. రెండవ ప్రధానమంత్రి గా భారతావనికి వారు చేసిన ‌సేవలు మరువలేనివని అన్నారు. భారత స్వాతంత్ర్య సమరం లో లాల్ బహదూర్ శాస్త్రి గారి పాత్ర కీలకమైనదని, యువత ఆయన ఆదర్శాలను అనుసరించి భారత దేశము పట్ల దేశభక్తి కలిగి ఉండి భారత దేశపు ప్రతిష్టను పతాక స్థాయికి తీసుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అఫ్జల్ ఖాన్ తో పాటు టీఆర్ఎస్ నాయకులు వంగ వెంకట్ రెడ్డి, షేక్ చాంద్ పాషా, కేసిఆర్ సేవాదళం మండల అధ్యక్షులు మహ్మద్ నిసార్ అహ్మద్ ఖాన్, బత్తుల శశికాంత్ యాదవ్ , షాఘంటి రమేష్ ,బత్తిని చందర్, బాబు, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
11ఎస్పీటీ -1: నివాళులు అర్పిస్తున్న నాయకులు