దమ్ముంటే సెస్ అవినీతిపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరపాలి.
బిజెపి నాయకులు కటకం మృత్యుంజయం.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. జనవరి 11. (జనం సాక్షి). మంత్రి కేటీఆర్ కు దమ్ముంటే సెస్ లో గతంలో జరిగిన అవినీతిపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని బిజెపి నాయకులు కటకం మృత్యుంజయం డిమాండ్ చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మృత్యుంజయం మాట్లాడుతూ ప్రధాని మోడీ గురించి విమర్శించే స్థాయి మంత్రి కేటీఆర్ కు లేదని అన్నారు. కేంద్రం పై విమర్శలు చేస్తున్న కేటీఆర్ పన్నుల రూపంలో దోచుకుపోతున్నట్టు విమర్శలకు దిగడాన్ని తప్పు పట్టారు. రక్షణ విభాగం విధులు బాధ్యతలు గురించి తెలుసుకోకుండా మంత్రి కేటీఆర్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. మంత్రి కేటీఆర్ కు దమ్ముంటే సెస్ లో జరిగిన అవినీతిపై సిట్టింగ్ చేత ప్రచార జరిపించాలని డిమాండ్ చేశారు. బిజెపి అంటే మంత్రి కేటీఆర్ కు భయం పట్టుకుందని బిజెపిని తలుచుకొని రోజులేదని అన్నారు. కేటీఆర్ ట్రైలర్ మాత్రమే చూపించారని రాబోయే రోజుల్లో బిజెపి సినిమా చూపిస్తుందని తెలిపారు. సమావేశంలో చేన్నమనేని కమలాకర్ రావు. రాజు సింగ్, మహిళా మోర్చా నాయకురాలు బర్కం లక్ష్మి,బర్కం నవీన్ యాదవ్, పలురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




