Thursday, 5 November 2026

క్రికెట్ టోర్నమెంట్ గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేత*

క్రికెట్ టోర్నమెంట్
గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేత*

రఘునాధపాలెం జనవరి 13 జనం సాక్షి మండలం పరిధిలోని పాపటపల్లి గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ పాపటపల్లి రైల్వే కాలనీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలు శుక్రవారం వారం నాడు విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.

ప్రధమ బహుమతి /15116 అందజేసిన పిన్ని కోటేశ్వరరావు,
పాపటపల్లి రైల్వే కాలనీ టీం కైవసం చేసుకోగా
రెండో బహుమతి మల్లికార్జున రావు, చంద్రం/ 10116 రూ పడమటి తండా టీం వారు పొందారు. మూడవ బహుమతి/ 3116 రూ పోయిల బోయిన శ్రీను, పాపటపల్లి టీం గెలుపొందిన వారికి షీల్డ్ బహుమతులు కస్తాల బ్రదర్స్ బాబు, అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ మేనేజ్మెంట్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ ముందుకొచ్చిన దాతలకు, గ్రామ పెద్దలకు సహకరించిన, టీం ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, ఏలాంటి గొడవలు లేకుండా విజయవంతంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్. ఈ కార్యక్రమంలో చిన్నబోయిన మలుసూర్, కస్తాల శ్రీను, పావురాల మంగయ్య, చంద్రం, గంగుల శీను, డాక్టర్ బాబు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.