లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా మెల్విన్ జోన్స్ జయంతి వేడుకలు
మెట్పల్లి టౌన్, జనవరి 13,
జనంసాక్షి :
మెట్పల్లి పట్టణ కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులు మెల్విన్ జోన్స్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, కేక్ కట్ చేసి, జయంతి కార్యక్రమం లయన్స్ క్లబ్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా
ఎంజెఎఫ్ లయన్స్ క్లబ్ సభ్యులు మహాజన్ నరసింహులు, వడ్డేపల్లి శ్రీనివాస్, చర్లపల్లి రాజేశ్వర్గౌడ్ గంగుల మురళి లను శాలువాలతో ఘనంగా
సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కటకం రాకేష్, సెక్రెటరీ ఇల్లెందుల శ్రీనివాస్, కోశాధికారి ఇందూరి రాకేష్, జెడ్సి కోట గంగ జీవన్ ,ప్రోహర్ తుకారాం, నాంపల్లి పెద్ద శ్రీనివాస్,దొంతుల ఆంజనేయులు,దొంతుల రాజ్ కుమార్, బాస నరసింహారావు ,రామారావు, సునీతరావు, దొంతుల పవన్, మర్రి భాస్కర్ ,చిన్న శ్రీనివాస్ లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు .
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా మెల్విన్ జోన్స్ జయంతి వేడుకలు




