ఘనంగా ఎస్ ఎఫ్ ఐ ఆవిర్భావ వేడుకలు
జహీరాబాద్ డిసెంబర్ 28( జనం సాక్షి) కోహిర్ మండలం లో ఎస్ ఎఫ్ ఐ 53వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.కోహిర్ మండలంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వద్ద 53 ఆవిర్భవ దినోత్సవ వేడుకల సందర్భంగా జెండా ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా జహీరాబాద్ ఏరియా కార్యదర్శి రాజేష్ మాట్లాడుతూ అధ్యయనం పోరాటం అనే నినాదంతో స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోషలిజం లక్ష్యాల కోసం ఎస్ఎఫ్ఐ 1970లో ఏర్పడి విద్యారంగ సమస్యలపై సమరశీల పోరాటాలు నిర్వహిస్తుందన్నారు ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేస్తుంది శాస్త్రమైన విద్యా అందించకుండా మూడో విశ్వాసాలు జపించి విద్యను ధ్వంసం చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుందన్నారు అయినా యూనివర్సిటీలో బలంగా ఉద్యమాలు చేసి విద్య వ్యాపారికరణ కాషాయకరణ నుండి కాపాడుకొని విధంగా పోరాటాలు చేసి యూనివర్సిటీలలో ఎస్ఎఫ్ఐ ఘనవిజయం సాధిస్తుంది కావున విద్యార్థినిలు విద్యార్థులు అందరూ ఎస్ఎఫ్ఐ చెసే పోరాటాలకు మద్దతు ఇస్తున్నారని అన్నారు మన హక్కులు మనం కాపాడుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు మల్లేష్,జగదీష్,రాఘవేంద్ర విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
ఘనంగా ఎస్ ఎఫ్ ఐ ఆవిర్భావ వేడుకలు




