కర్నూల్ జిల్లా వినియోగ దారుల పరిరక్షణ ఫోరం అధ్యక్షుడు కరణం కిషోర్
అయిజ, మార్చ్ 19 (జనం సాక్షి) :జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండల పరిధిలో చిన్న తాండ్రపాడు గ్రామంలోక్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించినకర్నూల్ జిల్లా వినియోగ దారుల పరిరక్షణ ఫోరం అధ్యక్షుడు కరణం కిషోర్.శ్రీ శ్రీ శ్రీ సత్యమాంబ కళ్యాణ మహోత్సవం మరియు ఉగాదిపండుగ సందర్భంగా చిన్నతాండ్రపాడు లో కరణం కిషోర్ సార్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం చేసిన తర్వాత మిట్టడొద్ది నాగలదిన్నేల మ్యాచ్ ను ప్రారంభించారు.అనంతరం వారు మాట్లాడుతూ క్రీడలు ఉల్లాసం తో పాటు శారీరక మరియు మానసిక ఆరోగ్యం ను ఇస్తాయి ఎలాంటి గొడవలు లేకుండా క్రీడాస్ఫూర్తి తో స్నేహపూర్వకంగా ఆడాలని సూచించారు.
ఓటమి విజయం అనేది సహజమే అని క్రీడాకారులు తగు జాగ్రత్తలతో క్రీడాకారులను క్రీడాలు ఆడుకోవాల్సిందిగా అని అన్నారు.
ఈ కార్యక్రమం లో సర్పంచ్ సత్యన్న,ఉపసర్పంచ్ మహేష్ నాయుడు,యంపిటిసి లు,వర్డ్ మెంబర్లు,గ్రామ పెద్దలు, గ్రామ యువత క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.




