వరంగల్ బ్యూరో, మార్చి 19 (జనం సాక్షి) గత మూడు రోజులుగా జిల్లాలో అల్పపీడన ద్రోని తుఫాను వల్ల పడిన వర్షాలకు రైతులు నష్టపోయారని రైతు సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు గత రాత్రి జిల్లా వ్యాప్తంగా వీచిన గాలులు కురిసిన వడగళ్ల వర్షం వల్ల వేలాది ఎకరాలలో పంట నష్టం జరిగిందని వారన్నారు ఆదివారం ఉదయం రైతు సంఘాల నాయకులు సం గెమండలం చింతల పెళ్లి కృష్ణానగర్ పల్లారిగూడ వంజరపల్లి తదితర గ్రామాలలోని పంట భూములలో రైతులు నష్టపోయిన పంటలను చూశారు ముఖ్యంగా ఈ రబీ సీజన్లో మొక్కజొన్న పంటను ఎక్కువ వేశారని ఇంకా 10, 15 రోజులలో పంట చేతికి వచ్చే అవకాశం ఈ వర్షాల వల్ల వారు కోల్పోయారని అన్నారు పంట దిగుబడి అధికంగా వస్తుందని ఆశపడ్డ రైతులకు ఈ తుఫాను వల్ల నిరాశే మిగిలిందని వారు అన్నారు ప్రస్తుతం వరి పంట పొట్టకు వచ్చి ఉందని రాళ్ల వర్షం వల్ల ఈ పంట కూడా దెబ్బతిన్నదని ఇవే కాక ఆకుకూరలు కూరగాయలు మరియు ఉద్యానవన పంటలు మొదలగున్నవి కూడా దెబ్బతిన్నాయని వారు అన్నారుపంట నష్టపోయిన రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు మొక్కజొన్నకు ఎకరానికి 50,000 వేలు వరి పంటకు 40 వేలు మరియు ఉద్యానవన పంటలకు ఎకరానికి లక్ష రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వారు డిమాండ్ చేశారు మండలంలోని గ్రామాలను సందర్శించిన వారిలో అఖిలభారత రైతుకూలీ సంఘం జిల్లా నాయకులు రాచర్ల బాలరాజు తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సోమిడి శ్రీనివాస్ ఓదెల రాజయ్య రైతు సంఘ నాయకులు , పోడేటి బాబు బొమ్మల స్వామి మరియు సోమిడి సాంబయ్య రమేష్ తదితరులు పాల్గొన్నారు




