రేవంత్ రెడ్డిని కలిసిన అశ్వారావుపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు
అశ్వారావుపేట, జనవరి 5( జనం సాక్షి) హైదరాబాదులో జరిగిన కాంగ్రెస్ పార్టీ శిక్షణ తరగతులకు హాజరైన అనంతరం అశ్వరావుపేట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మొగళపు చెన్నకేశవరావు, దంజు నాయక్, ఎంపీటీసీ వేములభారతి, సత్యవరపు తిరుమల, బాలగంగాధర్ హజారయ్య లు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని తమ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీపై పరిణామాలను చర్చించారు. ఎమ్మెల్యేల అభ్యర్థుల విషయంలో ఎవరైతే పనిచేస్తున్నారు వాళ్లకి మొదటి ప్రాధాన్యత ఇచ్చి పార్టీ బలోపేతానికి రాహుల్ గాంధీ నిర్ణయం మేరకు అనుకూలంగా నడుచుకుంటామని చర్చించుకున్నట్లు తెలుస్తోంది.
రేవంత్ రెడ్డిని కలిసిన అశ్వారావుపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు




