Wednesday, 4 November 2026

క్రికెట్ టోర్నమెంట్ విజేతకు బహుమతి.

జనం సాక్షి /కొల్చారంగత నాలుగు రోజులుగా వరి గుంతం గ్రామంలో విపియల్ సీజన్ 3 క్రికెట్ టోర్నమెంట్లో బుధవారం విజయత నిలిచిన జట్టుకు ప్రైజ్ మనీ 20 వేల రూపాయలు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి ప్రకటించారు ఇట్టి ప్రైజ్ మనీ మొత్తాన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగుల గారి మల్లేశం గౌడ్ మండల కార్యవర్గం ద్వారా గెలిచిన జట్టుకు అందించడం జరుగుతుందన్నారు ఇట్టి కార్యక్రమంలో కొజ్జాల మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ముత్యం గారి గోవర్ధన్. మండల ప్రధాన కార్యదర్శి గంగాసాని మహేశ్వర్ రెడ్డి. మండల ట్రెజరర్ చంగాపురం మధుసూదన్ రెడ్డి. కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు అచనపల్లీ శ్రీరాములు. ఎస్టీ సెల్ నాయకులు శంకర్ నాయక్. గ్రామ సర్పంచ్ శ్రీకాంత్ పిఎసిఎస్ చైర్మన్ ప్రభాకర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతల బాలరాజ్ వెంకట్ నిర్వహణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు