వికారాబాద్ రూరల్ జూన్ 14 జనం సాక్షి
సంక్షేమమే సురక్షితమైన వైద్య సేవలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని వికారాబాద్ జిల్లా, బి.ఆర్.ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్* పేర్కొన్నారు బుధవారం వికారాబాద్ పట్టణ పరిధిలోనితేజ కన్వెన్షన్ హాల్ లో తెలంగాణ రాష్ట్రదశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వైద్యారోగ్య దినోత్సవం* కార్యక్రమంలో పాల్గొన్నారు.9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో వైద్యరంగంలో చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు, వికారాబాద్ లో మెడికల్ కళాశాల, ఆయుష్ ఆసుపత్రి, డయాలసిస్ సెంటర్, క్రిటికల్ కేర్ హాస్పిటల్ వంటి అత్యాధునికమైన వైద్య సేవలను వికారాబాద్ ప్రజలకు అందించిన ఘనత ముఖ్యమంత్రికెసిఆర్ గారిదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ సురక్షితమైన వైద్య సేవలతో ప్రజలకు భరోసా కలిగి ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను వినియోగించుకుంటున్నారని, అదేవిధంగా కాన్పుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు.ఏఎన్ఎం లకు డిజిటల్ బిపి ఆపరేటివ్ మిషన్లు మరియు యూనిఫామ్స్ అందజేసి, ఆశా వర్కర్లకు యూనిఫామ్స్ అందజేశారు.అనంతరం వైద్యరంగంలో ఉత్తమ సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందిని అభినందిస్తూ… ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో వికారాబాద్ ఆర్డిఓ విజయ్ కుమారి మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ కుమార్ మార్కెట్ కమిటీ చైర్మన్ దీప భక్తవత్సలం ఎంపీపీ చంద్రకళ ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు మరియు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమ సురక్షితమైన వైద్య సేవలను అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్




