Wednesday, 4 November 2026

క్రికెట్ పోటీలను ప్రారంభించిన సి ఐ ప్రవీణ్ కుమార్

క్రికెట్ పోటీలను ప్రారంభించిన సి ఐ ప్రవీణ్ కుమార్

గోపాల్ పేట్ జనం సాక్షి జనవరి (09): మండల కేంద్రము లోని అమ్మ చెరువు క్రీడా మైదానంలో
జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని గోపాల్ పేట్ మండల పోలీస్ శాఖ తరపున నేటి నుంచి ఈ నెల 12 వరకు నిర్వహించే మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలను సి. ఐ ప్రవీణ్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకొని క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు సమాజంలో యువకులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలన్నారు. క్రీడల ఆడటం ద్వారా మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇస్తాయి అని అన్నారు అనంతరం స్థానిక ఎస్సై నవీద్ మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ లో మొత్తం 13 క్రికెట్ జట్లు తలపడనున్నాయి టోర్న మెంట్ లో విజేతలుగా నిలిచిన వారికి ప్రథమ బహుమతి పదివేల రూపాయలు ద్వితీయ బహుమతి ఐదు వేల రూపాయలు మరియు షీల్డ్ లు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంధ్య, జెడ్పీటీసీ మంద భార్గవి, వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, కోఆప్షన్ సభ్యులు మతిన్, గ్రామ సర్పంచ్ పొడవు శ్రీనివాసులు, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గాజుల కోదండం, గ్రామ అధ్యక్షుడు రాజేష్ గౌడ్, బిఆర్ఎస్ నాయకులు బొల్లేద్దుల బాలరాజ్, పానుగంటి శేఖర్, నాగరాజు, మొగులాలు, తదితరులు పాల్గొన్నారు