-గుడిపల్లి రిజర్వాయర్ లో మత్స్య సంపదకీ రక్షణ కల్పించాలి,మత్స్య సంపద దోపిడీ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి… -ప్రజావాణిలో అదనపు కలెక్టర్ గారికీ వినతి పత్రం అందజేసిన…. తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా నాయకులు,గుడిపల్లి మత్స్య సహకార సంఘం సభ్యులు….
నాగర్ కర్నూల్ రూరల్ జనవరి09(జనంసాక్షి):నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో.కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా.ఈరోజు గత కొద్ది రోజులుగా గుడిపల్లి రిజర్వాయర్ లో అగ్ర కులాల వారు వేరే కులాల వారు చేపలను ఎటువంటి హుక్కులు లేకుండా మత్స్య సంపదను లూటీ చేస్తున్న విషయం 2006లో గుడిపల్లి రిజర్వాయర్ పూర్తి అయ్యింది.మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా రిజర్వాయర్ లో 2016 నీటినీ నింపడం జరిగింది.నర్సయిపల్లి భూ నిర్వాసితులు రిజర్వాయర్ లో భూములు కోల్పోవడం జరిగింది.అప్పుడు ఉన్న ప్రభుత్వాలు నష్ట పరిహారం చెల్లించడం జరిగింది.కానీ కొంతమంది పెత్తందారులు కావాలని రిజర్వాయర్ లో ఎటువంటి జీవో లు లేకుండా అక్రమంగా చేపల వేట కొనసాగుతున్నారు.మా మత్స్య సంపదను లూటీ చేస్తున్నారు.వారిపై చర్యలు తీసుకోవాలి కోరగా.ప్రజావాణిలో అదనపు కలెక్టర్ కీ వినతి పత్రం అందజేసిన.మీరు పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకోండి అని అదనపు కలెక్టర్ సార్ తెలపడం జరిగింది.మత్స్య కారుల కలెక్టర్ కార్యాలయం ప్రజావాణి లో,ప్రభుత్వ ఆఫీస్ ల చుట్టూ తిరుగుతున్న మాకు న్యాయం జరగడం లేదు అని మత్స్య కారుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసిఆర్ అందజేసిన ఉచిత చేప పిల్లల పెంపకం ద్వారా లబ్ది పొందినాము అనుకుంటే.మా మత్స్య కారుల జీవనం బాగు పడింది అనుకుంటే కొంతమంది అగ్ర కులాల వారు వేరే కులాల వారు చేపలను లూటీ చేస్తు మా ఆర్థిక వ్యవస్థను నష్ట కలిగిస్తున్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా కార్యదర్శి బచ్చలి బంగారయ్య,నాగర్ కర్నూల్ మండల మత్స్య సహకార సంఘాల మండల అధ్యక్షుడు గూళ్ళ.హరికృష్ణ,గుడిపల్లి రిజర్వాయర్ అధ్యక్షుడు ఎర్రవోలు.చిన్నయ్య,గువ్వల.పర్వతాలు,అజ్మీర్,గువ్వల.రాములు పాల్గొన్నారు.




