Wednesday, 4 November 2026

క్రిశాంక్ ను అభినందించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్

కంటోన్మెంట్ జనం సాక్షి ఆగస్ట్ 14 నేటి తెలంగాణ సమాజం కోసం పాటు పడుతూ యువతలో మార్పు తీసుకురావడం కోసం నిరంతరం శ్రమిస్తున్న యువ నాయకుడు బీఆర్ఎస్ పార్టీ కోసం టీఎస్ఎండీసీ చైర్మన్ క్రిశాంక్ చేస్తున్న కృషిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ అభినందించారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ గా ఉన్న క్రిశాంక్, బీజేపీ నేతలు చేసిన వివిధ 100 వాగ్దానాలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యారనే ప్రచారాన్ని చేపట్టారు.3 నెలల క్రితం క్రిశాంక్ తన సోషల్ మీడియా ఖాతాలో ప్రతిరోజూ బీజేపీ నాయకుడి యొక్క 1 అబద్ధం వీడియోను పోస్ట్ చేయడం ద్వారా ఈ ప్రచారాన్నిప్రారంభించాడు. 100 అబద్ధాల బీజేపీ ప్రచారం పూర్తయిన సందర్భంగా ఈరోజు క్రిశాంక్ మంత్రి కేటీఆర్ ని కలిశారు, ఆయన దేశవ్యాప్తంగా వివిధ బీజేపీ నేతలు చెప్పిన 100 అబద్ధాల వీడియోలు, సమాచారంతో ముద్రించిన సీడీ మరియు పుస్తకాలను కేటీఆర్ ఆవిష్కరించారు.బీజేపీ నేతల తప్పుడు వాగ్దానాలను బట్టబయలు చేస్తున్న క్రిశాంక్ ప్రయత్నాలపై మంత్రి కేటీఆర్ గుడ్ జాబ్, కీప్ ఇట్ అప్ అని అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్లు టిఎస్ టిఎస్ చైర్మన్ పి.జగన్మోహన్ రావు,టిఎస్ఆర్ఈడి కో చైర్మన్ సతీష్ రెడ్డి, దినేష్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.