క్రిస్మస్ మహా వేడుకలు కి సిద్ధమైన కరుణగిరి చర్చి ప్రాంగణం
ఖమ్మం రూరల్, డిసెంబర్ 23(జనంసాక్షి) మానవాళి రక్షణ కోసం ఈ భూమిపై శాంతి సమాధానాలు నెలకొల్పడానికి దేవుడే మానవుడిగా అవతరించిన ఏసుప్రభు జన్మదిన సందర్భంగా ఖమ్మం కరుణగిరి లో క్రిస్మస్ వేడుకలను, ఘనంగా జరుపుటకు అంతా సిద్ధం చేసినారు.24వ తేదీ రాత్రి 10 గంటలకు ప్రారంభమయ్యే ప్రత్యేక క్రిస్మస్ వేడుకలలో కులమతాలకు అతీతంగా ప్రజలంతా పాల్గొని ఈ యొక్క ప్రభు దీవెనలు పొందాలని కరుణగిరి రెక్టర్ ఫాదర్.మాత్యూ, వరప్రసాద రాజు ఒక ప్రకటనలో తెలియజేశారు.ఈ వేడుకలలో ఖమ్మం బిషప్ పాల్గొంటారని వారు తెలియజేశారు.




