Saturday, 7 November 2026

మత్స్యకారులు ఆర్థికంగా ఎదిగడమే సీఎం కేసీఆర్ లక్ష్యం

మత్స్యకారులు ఆర్థికంగా ఎదిగడమే సీఎం కేసీఆర్ లక్ష్యం

ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి

వీణవంక డిసెంబర్ 23 (జనం సాక్షి)వీణవంక మండలంలోని రెడ్డిపల్లి .ఇప్పలపల్లి రెండు గ్రామాలలోని చెరువులకు ఏనుబై రెండు వేల చేప పిల్లలను ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మత్స్యకారులకు పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలకు పెద్దపీట వేసిన తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు అందులో భాగంగా ముదిరాజుల కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకోవడం కోసం సీఎం కేసీఆర్ ఉద్దేశం ఉచితంగా చేప పిల్లలను ఈ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ పంపిణీ చేయడం చాలా అదృష్టవంతులు అన్నారు ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ను గుర్తుంచుకోవాలని రానున్న రోజులలో సీఎం కేసీఆర్ వెంట రాష్ట్ర ప్రజలు ఉండాలని వారన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి, వైస్ ఎంపీపీ రాయుశెట్టి లతా శ్రీనివాస్, సర్పంచులు నీల కుమారస్వామి, పోతుల నరసయ్య, పొదిలా జ్యోతి రమేష్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు ఎక్కేటి రఘుపాల్ రెడ్డి, ఎంపీటీసీ సవిత మల్లయ్య వడ్డేపల్లి లక్ష్మీ భూమయ్య మాజీ పిఎసిఎస్ చైర్మన్ గంగాడి తిరుపతిరెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ మూదుగంటి శ్యాంసుందర్ రెడ్డి. భానుచందర్,, మత్స్య పరిశ్రమక సంఘం నాయకులు మోటం సంపత్ రాజు కుమార్ సారయ్య రవి తోపాటు నాయకులు కార్యకర్తలు ముదిరాజ్ కులస్తులు తదితరులు పాల్గొన్నారు….