క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించాలి
ఎమ్మెల్యే గంపగోవర్థన్
నియోజకవర్గం వారీగా గిఫ్ట్ ప్యాకెట్ల పంపిణీ, విందు కార్యక్రమానికి ప్రణాళిక సిద్ధం చేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే గంపగోవర్థన్ అన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రిస్మస్ పండుగ పురస్కరించుకుని రామారెడ్డి మండలం అన్నారం గ్రామంలో పేద క్రిస్టియన్ లకు దుస్తుల పంపిణి చేసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని జిల్లా వ్యప్తంగా ఉన్న చర్చిలలో విందును ఘనంగా నిర్వహించాలన్నారు. జిల్లాలో క్రిస్మస్ పండుగ పురస్కరిం చుకొని దుస్తుల పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా చేపట్టిందని గుర్తు చేశారు. ఈ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో. గ్రామ సర్పంచ్ అమృత , ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ దశరథ్ రెడ్డి, వైస్ ఎంపీపీ రవీందర్ రావ్ , ఎంపీటీసీలు, ఫాదర్ డేవిడ్, రెవెన్యూ సిబ్బంది, ఎంపీడీవో విజయ్ కుమార్, వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, క్రిష్టియన్ సోదరి , సోదరులు , తదితరులు పాల్గొన్నారు.




