Saturday, 7 November 2026

సిపిఐ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి అందరూ హాజరై విజయవంతం చేయాలి

సిపిఐ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి అందరూ హాజరై విజయవంతం చేయాలి హుజూర్ నగర్ డిసెంబర్ 24 (జనం సాక్షి): ఈనెల 26వ తారీఖున హుజూర్ నగర్ లో జరిగే సిపిఐ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి అందరూ హాజరై విజయవంతం చేయాలని సిపిఐ నాయకులు, మాజీ వార్డ్ కౌన్సిలర్ జడ శ్రీనివాస్ కోరారు. శుక్రవారం హుజూర్ నగర్ పట్టణంలోని జంగిడి బజార్ సెంటర్లో సిపిఐ పార్టీ 2023 సంవత్సరం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారన్నారు. ఈ కార్యక్రమంలో జడ శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ 98 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాటం నిర్వహిస్తుందన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీకి ఎందరో నాయకులని, ప్రజాప్రతినిధులు చేసిన ఘనత ఉందని నాటి నుంచి నేటి వరకు ఎన్ని పార్టీలు వచ్చినప్పటికీ ఈ ప్రాంత ప్రజలు సిపిఐ పార్టీని ఆదరిస్తూనే ఉన్నారని, చైతన్య మైనటువంటి కమ్యూనిస్టు పార్టీ సభ్యులు ఈనెల 26వ తారీఖు రోజుకు సభ్యత్వం పూర్తిచేసి పట్టణ కమిటీకి ఇచ్చి ఆదర్శవంతంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్యదర్శి, పట్టణ కార్యవర్గ సభ్యులు ఇందిరాల వెంకటేశ్వర్లు, జెనీగ వెంకటేశ్వర్లు, సిగినంపుల్లమ్మ , అమరబోయిన పిచ్చయ్య, బొమ్మనబోయిన వీరయ్య, కూరాకుల చిన్న వెంకన్న, పచ్చిపాల కోటి, అమరబోయిన చిన్న వీరమ్మ, రమేష్ తదితరులు పాల్గొన్నారు