ఘనంగా సిపిఐ 98వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
పేదల పొట్టలు కొడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్
రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీ రామకృష్ణాపూర్ లో సిపిఐ 98వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో సిపిఐ జెండాను రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలిసిన శంకర్ ఆవిష్కరించారు. అనంతరం పట్టణ సహాయ కార్యదర్శులు జిల్లా సమితి సభ్యులు వనం సత్యనారాయణ, నక్క వెంకట స్వామి శనివారం కేకు కట్ చేసి సంబరాలుజరుపుకున్నారు.
ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ మాట్లాదారు. 1925 డిసెంబర్ 26న, పార్టీ అవిర్భావించిన నాడే దున్నేవాడికే భూమి కావాలని పిలుపునిచ్చిన సిపిఐ, నాటినుండి నేటి వరకు బడుగు బలహీన వర్గాల, పేద ప్రజల కొరకు ఎన్నో సమరశీల పోరాటాలు చేసిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ది గా పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసి సుమారు 4,500 మంది కమ్యూనిస్టులు ప్రాణ త్యాగాలు చేసి, పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేసిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీ సిపిఐకే దక్కుతుందన్నారు. 3000 గ్రామాలకు విముక్తి కల్పించింది సిపిఐ అని గర్వంగా పేర్కొన్నారు.
కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ పేరుతో కార్పొరేట్ శక్తులకు ఆదానీ అంబానీ లకు దేశ సంపదలను దార దత్తం చేస్తున్నదనీ,కార్మిక కర్షక, రైతు వ్యతిరేక చట్టాలను కార్మిక హక్కులను కాలరస్తు బొగ్గు బావుల ప్రైవేటీకరణ చేస్తూ, కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్న ప్రభుత్వం బిజెపి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని సుమారు 1200 మంది విద్యార్థి యువకుల ఆత్మ బలిదానాలతో నిధులు, నీళ్లు, నియామకాల పేరుతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రైతుల ఆత్మహత్యలు సంక్షేమ పథకాలు అట్టడుగు ప్రజలకు అందకుండా, పార్టీలో పలుకుబడి జెండా మోసిన వారికే సంక్షేమ పథకాలు అందుతున్నాయనీ, దళిత బంధు పారదర్శకంగా అందరికీ ఇవ్వాలని, అదేవిధంగా బీసీ బందు, గిరిజన బందు కూడా అమలు చేయాలని, అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని, తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.రాబోయే రోజులలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఇల్లు లేని నిరుపేదలకు జిల్లాలో ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్న ఎర్రజెండాలు పాతి పేదలకు భూ పంపిణీ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
పార్టీ కార్యాలయం నుండి బైక్ ర్యాలీతో వివిధ మెయిన్ సెంటర్లలోని పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో
సిపిఐ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ , సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఇప్పకాయల లింగయ్య ,
జిల్లా సమితి సభ్యులు మిట్టపల్లి పౌల్, కాదండిసాంబయ్య,
మేరుగు రాజేశం, నాయకులు గాజులమణమ్మ , శఠగోపం కిష్టయ్య,బీఏగుడ మొండి,
గోవిందులరమేష్ , పోతర్ల రాములు, మాదాస్ శంకర్, బైర కొమిరెల్లి,బీకే దేవానంద్, బోయపోతులకొమురయ్య, ఈరవేన రవీందర్, మోతే రాయలింగు, మారపల్లిరవి, చొప్పదండి దుర్గ, మామిడాల సత్తయ్య, మోతుకుల రాజు, గుమస్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.




