క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన డ్రీమ్ హోమ్స్ అండ్ డిజైనర్ ముహమ్మద్ ఫయాజ్ కొండమల్లేపల్లి డిసెంబరు 25 జనం సాక్షి న్యూస్: క్రిస్మస్ పండుగ శుభ సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ క్రైస్తవ సోదరులకు అందరికీ కొండమల్లేపల్లి డ్రీమ్ హోమ్స్ అండ్ డిజైనర్ ముహమ్మద్ ఫయాజ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దైవ కుమారుడు జీసస్ మానవుడిగా జన్మించిన రోజును ప్రపంచమంతా క్రిస్మస్గా జరుపుకుంటారని ఆయన అన్నారు. క్రిస్మస్ అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, అది మనిషిని నిరంతరం సన్మార్గంలో నడిపించే దైవికమైన ఒక భావన చెప్పారు.
దుర్మార్గం నుంచి సన్మార్గానికి, అమానుషత్వం నుంచి మానవత్వానికి, చెడు నుంచి మంచికి, దురాశ నుంచి దాతృత్వం–త్యాగాలకు జీసస్ తన జీవితం ద్వారా బాటలు వేశారని చెప్పారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, ఆకాశమంత సహనం, అవధులు లేని త్యాగం, శాంతియుత సహజీవనం, శత్రువుల పట్ల సైతం క్షమాగుణం కలిగి ఉండాలన్నారు. ఇవీ జీసస్ తన జీవితం ద్వారా మనకు ఇచ్చిన సందేశాలని పేర్కొన్నారు జీసస్ జన్మదిన శుభ సందర్భంగా దేవరకొండ నియోజకవర్గం క్రైస్తవ సోదరీ,సోదరమణులకు మరియు సమస్త ప్రజానీకానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు
క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన డ్రీమ్ హోమ్స్ అండ్ డిజైనర్ ముహమ్మద్ ఫయాజ్




