Sunday, 8 November 2026

ప్రభుత్వ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి

ప్రభుత్వ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): ప్రభుత్వ హాస్టళ్లలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఎన్ఎస్ యుఐ కృషి చేస్తుందని నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గ ఉపాధ్యక్షులు రాజబోయిన శ్రీకాంత్ అన్నారు.ఆ సంఘ రాష్ట్ర అద్యక్షులు బల్మూరి వెంకట్ సూచన మేరకు జిల్లా అధ్యక్షులు కందుకూరి అంబేద్కర్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని ఆదివారం సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా వసతిగృహాలు – మా హక్కులు అనే నినాదంతో ప్రభుత్వ వసతిగృహాల సందర్శన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.బిసీ వసతి గృహంలోని ప్రధాన సమస్యలైన ఆహారం,గదుల శుభ్రత, మౌలిక సమస్యల గురించి వార్డెన్ కి వివరించి,వాటిని పరిష్కరించాలని కోరారు.ప్రభుత్వ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు మహర్షి , ఎన్ఎస్ యుఐ అసెంబ్లీ నాయకులు నగేష్ , జాఫర్, శివ , కార్తీక్ ,వేణు, నందు, భరత్ తదితరులు పాల్గొన్నారు.