జ్యోతిష రత్న అవార్డు ప్రదానం
మెట్ పల్లి టౌన్, డిసెంబర్ 25, జనంసాక్షి :
విశ్వ జ్యోతి జ్యోతిష విజ్ఞాన సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో కరీంనగర్ లో నిర్వహించిన జ్యోతిష సమ్మేళనం లో జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణానికి చెందిన మ్యాడారపు మారుతి కి జ్యోతిష రత్న అవార్డు ను ప్రదానం చేశారు.జ్యోతిష పుస్తకాల రచయిత పుచ్చ శ్రీనివాసరావు శాలువ తో సత్కరించి అవార్డును ప్రధానం చేశారు. పొట్టి శ్రీ రాములు పీజీ కాలేజీలో ఎంఏ జ్యోతిషము లో పట్టా పొందడం చాలా గొప్ప అని కితాబ్ చేశారు. ఈ సందర్భంగా మ్యాడారం మారుతి మాట్లాడుతూ ఈ అవార్డు రావడం ఆనందముగా ఉందని తనష సంతోషాన్ని తెలియజేశారు.ఈ ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కు చెందిన జ్యోతి విజ్ఞాన సంస్థ జ్యోతిష్యులు మరియు అవార్డు గ్రహీత మ్యాడారం మారుతి అది కుటుంబ సభ్యులు మరియు మిత్రులు, శ్రేయోభిలాషులు, తదితరులు పాల్గొన్నారు
జ్యోతిష రత్న అవార్డు ప్రదానం




