క్రీడలతో వ్యక్తిత్వ వికాసానికి దోహదం
— ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు
జహీరాబాద్ జనవరి 6 (జనం సాక్షి). క్రీడలతో వ్యక్తిత్వ వికాసానికి దోహదం పడుతుందని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. శుక్రవారం పట్టణంలోని భాగ రెడ్డి క్రీడా మైదానంలో ఖిజర్ యఫై గోల్డ్ కప్ లీగ్ పోటీల్లో భాగంగా ఒక మ్యాచ్ జరిగింది, అఫన్ క్రికెట్ క్లబ్ అచ్చంపేట మరియు ఇగల్ సీసీ జట్ల మధ్య జరిగిన పోటీలో అఫన్ సీసీ టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తూ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టనికి 239 పరుగులు చేయగా 240 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఈగల్ సీసీ 18.2 ఓవర్లలో 132 పరుగులకు అలౌట్ అవ్వడంతో అచ్చంపేట 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది, అచ్చంపేట ఓపెనర్ బ్యాటర్ కర్రీ 53 బంతుల్లో 10 బౌండరీలు 10 సిక్సర్ల సహాయంతో 130 పరుగులు నోటౌట్ నిలవడంతో కర్రీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది, ఈ సందర్భంగా ముఖ్య అతిధి పాల్గొన్న ఖిజర్ యఫై బి ఆర్ ఎస్ నాయకులు మాట్లాడుతూ అంకితభావంతో ముందుకు వెళ్ళినట్టైతే రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద వేదికల మీద ఆడే అవకాశం ఉందని, క్రీడాకారులు ఆటలో తమ తమ జట్ల తరపున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చలని, బ్యాటింగ్ లో 130 పరుగులు చేసిన కర్రీకి బంగారు భవిష్యత్తు ఉందని, ప్రభుత్వ విప్ గా ఉన్నప్పటికీ ఒక ఆటగాడిగా జహీరాబాద్ క్రిడ మైదానంలో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పాల్గొనడం వారికి క్రికెట్ పట్ల ఉన్న మక్కువకు నిదర్శనం అని, రాబోయే రోజుల్లో ఇలాంటి మంచి ప్రదర్శనలు మరిన్ని కనబర్చలని బిఆర్ఎస్ నాయకులు ఖిజర్ యఫై అన్నారు. కార్యక్రమంలో బిలాల్ పూర్ సర్పంచ్ నర్సింలు, మాద్రి సర్పంచ్ రమేష్ సాగర్, మల్చేల్మా ఎంపిటిసి మొహమ్మద్ ఇస్మాయిల్, మొహమ్మద్ మాక్సుద్, మర్రి బాల్ రెడ్డి, సద్దమ్ కుసంగి, తజోద్దీన్ శేకపూర్, ఇస్మాయిల్ శేకపూర్, అదం యఫై, అబుద్ యఫై, పబ్బతి సంతోష్, తయ్యబ్ అలీ, మద్ద రామి రెడ్డి, అబ్దుల్ మతిన్, ఆర్గనైజర్లు మాక్సుద్ అలీ, ఖాజా పటేల్, బాబాన్, అమనుల్లా ఖాన్, అజ్మత్ అలీ, మొహమ్మద్ సాజిద్, అసద్ యఫై, శ్రీనివాస్ ముదిరాజ్, మొహమ్మద్ సలీమ్, ఇబ్రహీం, నాయకులు, అభిమానులు, ప్రేక్షకులు పాల్గొన్నారు.
క్రీడలతో వ్యక్తిత్వ వికాసానికి దోహదం




