Wednesday, 4 November 2026

తభితా ఆశ్రమంలోని చిన్నారులకి అండగా సింగరేణి కార్మికులు

తభితా ఆశ్రమంలోని చిన్నారులకి అండగా సింగరేణి కార్మికులు
– క్రెడిట్ సొసైటి సభ్యులని అభినందించిన కందుల సంధ్యారాణి
యైటింక్లయిన్ కాలని జనవరి 06 (జనంసాక్షి):
స్థానిక రామగుండం రైల్వేస్టేషన్ ఏరియా తబితా ఆశ్రమంలోని చిన్నారులకి లక్ష రూపాయల విలువ గల సామాగ్రిని నాయకులు, జడ్పీటీసీ కందుల సంధ్యారాణిపోచం వారి చేతుల మీదుగా ఆశ్రమ నిర్వహకులు వీరెందర్ నాయక్ కి అందజేయడం జరిగిందన్నారు.
సింగరేణి క్రెడిట్ సోసైటి జీడికే 10 ఇంక్లైన్ సంస్థ నిర్వహకులంతా కలిసి గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా ఆశ్రమంలోని చిన్నారులకి 30 బెడ్స్, నెలకి సరిపడా సరుకులని లక్ష రూపాయలు వెచ్చించి కోని అందజేయాలని ముందుకు రావడం జరిగింది. ఆశ్రమంలోని చిన్నారుల ఇబ్బందిని ఆశ్రమ నిర్వహకులు సింగరేణి క్రెడిట్ సొసైటి సంస్థ జీడికే 10 ఇంక్లైన్ వారి దృష్టికి తీసుకుపొవడంతో, మానవత్వంతో కొని ఇవ్వడానికి ముందుకు రావడం జరిగిందన్నారు. ఈ సంధర్బంగా సింగరేణి క్రెడిట్ సొసైటి నిర్వహకులు ఎ శ్రీధర్ రావు,నాసీర్ ఆహ్మద్, గోసిక అశోక్, బి.రాంనారాయణ, ఈ సత్యనారాయణలని అభినందించారు. సొసైటి నిర్వహకులు భవిష్యత్తులో ఇంకా ఎంతో ఎత్తుకి ఎదిగి వారి సహయ సహకారాలు ఎప్పటికి ఆశ్రమంలోని చిన్నారులకి అందజేయాలని ఈ సంధర్బంగా ఆ భగవంతున్ని వారు కోరుకున్నారు.