Wednesday, 4 November 2026

ఘనంగా హరిప్రియ క్రికెట్ కప్ సీజన్-2 ప్రారంభం

ఘనంగా హరిప్రియ క్రికెట్ కప్ సీజన్-2 ప్రారంభం

టేకులపల్లి, జనవరి 6( జనం సాక్షి ): నూతన సంవత్సర, సంక్రాంతి పండుగ సందర్భంగా హరిప్రియ క్రికెట్ కప్ సీజన్ -2 క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం మ్యాచ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్గనైజర్ జాటోత్ నరేష్ నాయక్ వివరాలు తెలుపుతూ ఐదు క్రికెట్ మ్యాచ్లు గెలుపొందాయని, కెప్టెన్ అనిల్ ఆర్మీ మద్రాస్ తండా టీం, పిటిసి వారియర్స్ పెట్రాంచెలక టీం, కింగ్ కోహ్లీ ముఖంపాడు టీం, వికేటి జూనియర్స్ వెంకటయ్య తండా జూనియర్ టీం, టీకేపీ బుల్లెట్ టీం విజయం సాధించాయని తెలిపారు. క్రికెట్ మ్యాచ్ లో ఆర్గనైజింగ్ నిర్వాహకులు క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు.