– జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డిహుజూర నగర్ ఫిబ్రవరి 9 (జనంసాక్షి): మండలంలోని
అమరవరం గ్రామంలో లింగమంతుల జాతర సందర్భంగా ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడలు నేటితో ముగిసినాయి. గెలిచిన టీమ్స్ కి బహుమతులు ప్రధానం చేయుటకు ముఖ్య అతిథులుగా హుజూర్ నగర్ జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, సర్పంచ్ గుజ్జుల సుజాతఅంజిరెడ్డి లతో కలిసి బహుమతులు అందజేశారు. గురువారం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల వల్ల క్రీడాకారులలో ఐక్యమత్యం, పోరాడే స్ఫూర్తి స్నేహభావం అలవాడతాయి అన్నారు. క్రీడల వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కలుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో క్రీడలకు క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహం కల్పిస్తుందన్నారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందించడంతోపాటు చదువుల్లో ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించిందన్నారు. హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులకు వివిధ సంస్థల ద్వారా ఆర్థిక సహాయం అందించేలా కృషి చేస్తున్నారు అని తెలిపారు. నియోజకవర్గ కేంద్రంలో మినీ స్టేడియం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు అని తెలియజేశారు. మూడు రోజులు గా జరిగిన కబడ్డీ క్రీడలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. అందులో ప్రథమ బహుమతిని కల్లూరు టీం, ద్వితీయ బహుమతిని సర్వారం టీం కి, తృతీయ బహుమతిని నడిగూడెం టీం , చతుర్ధ బహుమతిని దాచారం టీం , పంచమ బహుమతిని అమరవరం టీం గెలుచుకుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాల సైదులు, కదిర వెంకటరెడ్డి, శ్రీనివాస్, బిఆర్ఎస్ నాయకులు కామిశెట్టి వెంకటేశ్వర్లు, ఉస్తెల చిన లింగారెడ్డి, సీతారాంరెడ్డి, కందుల అంజిరెడ్డి, పాల లింగారెడ్డి, కేశవరెడ్డి, సుధీర్ రెడ్డి, వేణు, ఉపేందర్ రెడ్డి, క్రీడల నిర్వహణ కమిటీ సభ్యులు గోపి, సతీష్ , నవీన్, బహుమతుల దాతలు తదితరులు ఉన్నారు.




