Wednesday, 4 November 2026

క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి

 హుజూర్ నగర్ జనవరి 23 (జనంసాక్షి): క్రీడల పోటీలలో పాల్గొనడం ద్వారా మానసిక ఉల్లాసాన్ని, స్నేహ సంబంధాలను పెంపొందించుకోవచ్చునని సీనియర్ సివిల్ జడ్జి జిట్టా శ్యాం కుమార్ అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయవాదులకు, కోర్టు సిబ్బందికి, కోర్టు కానిస్టేబుల్ లకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలను బార్ అసోసియేషన్ హాలునందు సోమవారం జూనియర్ సివిల్ జడ్జి సాకేత్ మిత్ర, బార్ అసోసియేషన్ అధ్యక్షులు సాముల రామిరెడ్డిలతో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసుల విచారణ ప్రక్రియలో ప్రతినిత్యం న్యాయవాదులు ప్రాసిక్యూషన్ తరపున పోలీసులకు మధ్య తీవ్ర మానసిక ఒత్తిడి ఉంటున్నదని అటువంటి మానసిక ఒత్తిడిని జయించడానికి ఈ క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. కోర్టు సిబ్బందిని, కోర్టు కానిస్టేబుల్ లను కూడా క్రీడలలో భాగస్వామ్యులుగా చేయటం అభినందనీయమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి సాకేత్ మిత్ర, బార్ అసోసియేషన్ అధ్యక్షులు సాముల రామిరెడ్డి, మాజీ అధ్యక్షులు నారపరాజు శ్రీనివాసరావు న్యాయవాదులు కాల్వ శ్రీనివాసరావు, ఎం.ఎస్ రాఘవరావు, నట్టే సత్యనారాయణ, కుక్కడపు బాలకృష్ణ, వి. జి. కె. మూర్తి, మీసాల అంజయ్య, యాదగిరి, ప్రవీణ్, వట్టికూటి అంజయ్య, రమణారెడ్డి, కమతం నాగార్జున, కొట్టు సురేష్, పాలేటి శ్రీనివాసరావు, ఉదారి యాదగిరి, జక్కుల వీరయ్య, సురేష్ నాయక్, వెంకటేష్ నాయక్, శంకర్ నాయక్, లతీఫ్, మద్దుల నాగేశ్వరరావు, గొట్టే ప్రశాంత్, చక్రాల వెంకటేశ్వర్లు, నరేష్, వీరయ్య, వెంకటరెడ్డి, ప్రదీప్తి, మౌనిక తదితరులు పాల్గొన్నారు.