Wednesday, 4 November 2026

ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి

మెట్పల్లి టౌన్, జనవరి 23,
జనంసాక్షి :
మెట్పల్లి పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో
సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆయన దేశానికి ఎంతో మేలు చేశారని.వారిని స్మరించుకుంటూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం శేఖర్ మాట్లాడుతూ స్వాతంత్ర సమర పోరాటంలో నేతాజీది ఘనమైన చరిత్ర అని, దేశం కోసం భారతదేశ సైన్యం ను స్థాపించి దేశ భద్రతను పెంపొందించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ సేవలు మరువలేనివని కొనియాడారు సుభాష్ చంద్రబోస్ చరిత్ర ప్రతి యువకుడు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో చింతకింది శ్రీధర్,సజ్జు,శంకర్,రమేష్,రాకేష్,
కిరణ్ తదితరులు పాల్గొన్నారు.