Tuesday, 3 November 2026

క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి

 

 

 

 

 

 

 

 

ఫోటో రైట్ అప్: రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్ క్రీడలు ప్రారంభిస్తున్న నిర్వాహకులు  పెన్ పహాడ్. ఫిబ్రవరి 06 (జనం సాక్షి) : క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని సచిన్ టెండుల్కర్ క్రికెట్ అసోసియేషన్ ఆర్గనైజర్స్ తండ నాగరాజు , కట్టోజు నరేష్,పేరూరి వెంకటేశ్వర్లు, అన్నారు. మండల కేంద్రంలోని సచిన్ టెండుల్కర్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్ క్రీడలను వారు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాని పురస్కరించుకొని క్రీడలు నిర్వహించడం జరుగుతుందని క్రీడా అభిమానులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు .30016 ప్రథమ బహుమతి , ద్వితీయ బహుమతి 20016 ,తృతీయ బహుమతి 15 0 16, చతుర్ధ బహుమతి 10016, గెలుపొందిన విజేతలకు అందజేయడం జరుగుతుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్స్ పేరాల నాగేందర్, కొండేటి గోపి, నాయకులు చనగాని సైదులు, దండే0పల్లి దేవేందర్, శనగాని రాంబాబు, ఎస్ బాలు, వ గ్గు శ్రీకాంత్, మామిడి శేఖర్ , పి.సురేందర్, తదితరులు పాల్గొన్నారు.