-ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలిమండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్లవుల ఉపేందర్ యాదవ్సిరోల్ ,జనవరి17/జనం సాక్షి న్యూస్: సిరోల్ మండలంలోని ఉప్పరి గూడెం గ్రామంలో ఆదివారం రాత్రి తోట అబ్బాయా కు చెందిన గొర్రెల మందపై వీధి కుక్కలు దాడి చేశాయి.13 గొర్రెలు మృతి చెందగా,5 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. సుమారు రూ. 1,10,000 వరకు నష్టం వాటిల్లిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే ఉప్పరిగూడెం గ్రామానికి చెందిన తోట అబ్బాయా అనే రైతు తన ఇంటి వద్ద గొర్రెల గుంపు దొడ్డిలో పెట్టి పడుకోవా రాత్రి సమయంలో వీధి కుక్కల గొర్రెల మందపై స్వైరవిహారం చేశాయి. ఈ దా డిలో 13 గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందాయి. 5 గొర్రెలు తీవ్రంగా గాయ పడ్డాయి. పశువైద్యాధికారికి సమాచారం తెలుపగా డాక్టర్ రామ్ చందర్ ఆధ్వర్యంలో గాయపడ్డ గొర్రెలకు చికిత్స అందిస్తున్నారు.సంఘటన స్థలానికి పరిశీలించిన యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు రాజుయాదవ్, కురవి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్లవుల ఉపేందర్ యాదవ్ మాట్లాడుతూ గొర్రెల మృతితో సుమారు లక్ష పదివేల రూపాయల నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందజేయాలని వాళ్లు కోరారు. అదేవిధంగా ఉప్పరగూడెం గ్రామంలో వీధి కుక్కలను నివారించేలా చూడాలని వాళ్ళు ఉన్నారు.




