క్రీడలు శరీర దారుఢ్యానికి దోహదపడతాయి
* లక్కినేని శ్యామ్
టేకులపల్లి,జనవరి 7 (జనం సాక్షి): యువత క్రీడల్లో రాణించాలని, క్రీడలు మానసికోలాసంతోపాటు శరీర దారుడ్యానికి దోహదపడతాయని మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, బేతంపూడి సొసైటీ డైరెక్టర్ లక్కినేని శ్యామ్ అన్నారు. శనివారం టి పి ఎల్ హరిప్రియ కప్ సీసన్ 2 లో రెండోవ రోజు జరిగిన లీగ్ లో గెలిచిన మ్యాచ్ లకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లు లక్కనేని శ్యామ్, టేకులపల్లి ఒకటో వార్డు సభ్యులు నోముల బాను చందర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ముత్యాలం పాడు క్రాస్ రోడ్డు సర్పంచ్ మాలోతు సురేందర్, బానోత్ రవికుమార్,మేనేజ్మెంట్ ప్రవీణ్, సందీప్, హేమంత్,అనిల్ ఆర్మీ,సంతోష్, లడ్డు,బొడా రమేష్,విజయ్ ,రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.




