నూతన ఆంగ్ల సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరించిన పాలెం డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల మిత్రబృందం.
-22 సంవత్సరాలనుండి జనవరి 6 న మిత్రబృందం ఆత్మీయ కలయిక.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జనవరి 7 (జనం సాక్షి):
నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల పరిధిలోని పాలెం శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 1998-2001 విద్యాసంవ త్సరం లో చదివిన పూర్వ విద్యార్థుల మిత్రబృందం శనివారం వనపర్తి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న తిరుమలాయ గుట్టమీద గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంను దర్శించుకున్నారు. అనంతరం ఆలయం ఆవరణలో 2023 నూతన ఆంగ్ల సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా మిత్రబృందం సభ్యులు మాట్లాడుతూ పాలెం శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2001 విద్యా సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేసుకున్నామని డిగ్రీ చదువుతున్న మూడేండ్ల లో కళాశాలలో ఏబీవీపీ విద్యార్థి యూనియన్ తరఫున విద్యార్థుల సమస్యలపై ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని,ఆ క్రమంలో కలిసిన బిఎస్సీ ,బిజడ్సీ విద్యార్థులం10 మందితో 2001జనవరి 6న మిత్రబృందంగా ఏర్పడడం జరిగిందని,20201న ఒక మిత్రుడిని కలుపుకుని మిత్రబృందం లో మొత్తం11మంది సభ్యులం అయ్యామని తెలిపారు.2002 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం జనవరి 6 న తప్పనిసరిగా ముందే నిర్ణయించుకున్న ప్రదేశంలో కలుసు కుంటున్నామని వారు తెలిపారు.ప్రస్థుతం మేమంతా పలు స్థలాలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో వివిధ హోదాలల్లో పనిచేస్తున్నా మని వివరించారు.2002న హైదరాబాద్ లోని బిర్లా మందిరం దేవాలయంలో, 2003 న శ్రీశైలం దేవస్థానం లో ,2004 న మంత్రాలయం దేవస్థానంలో, 2005 న సోమశిల దేవస్థానంలో,2006 న మద్ది మడుగు దేవస్థానంలో, 2007న హనుమకొండలోని వేయి స్తంభాల గుడి లో, 2008 న చిలుకూరు బాలాజీ దేవస్థానంలో, 2009 న మన్యం కొండ వెంకటేశ్వర్ల దేవస్థానంలో, 2010న నాగర్ కర్నూల్ శ్రీ సరస్వతీ దేవాలయం లో,2011 న శ్రీరంగాపూర్ దేవస్థానంలో,2012న నాగర్ కర్నూల్ లో,2013 న మారెడు మాన్ దిన్నె లో, 2014 న అలంపూర్ జోగులాంబ దేవాలయంలో,2015 న వేములవాడ రాజరాజేశ్వరీ దేవాలయంలో,2016 న సింగోటం శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయం లో, 2017న వనపర్తి లో,
2018 న యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయం లో,2019,2020 న నాగర్ కర్నూల్ లో,2021 న మక్తల్ లో, 2022 న పామాపూర్ లో,ఈ సంవత్సరం జనవరి 6న వనపర్తి లో కలుసుకోవడం జరిగిందని అన్నారు.ఇందులో భాగంగానే ఈ రోజు తిరుమలాయ గుట్ట దేవాలయం ను దర్శించుకోవడం జరిగిందని అన్నారు.
ఈ ఆత్మీయ కలయిక సందర్భంగా మిత్రబృందం కుటుంబాల బాగోగులు మరియు విద్యా,ఉద్యోగ విషయాలు, సామాజిక అంశాలపై చర్చించుకుంటామని తెలిపారు.మిత్ర బృందంలో డి.కృష్ణయ్య, ఎస్.యాదగిరి, కేవీ.భాస్కర్,కె. ఆనంద్ రెడ్డి,ఎం.జంబులయ్య,కె.వెంకటేష్, ఎం.రామకృష్ణ, టి.ప్రకాష్,ఎస్.ప్రసాద్ చారి, డి.రాజేశ్వర్ రావు,ఆర్.మాధవరెడ్డి లు ఉన్నారు.




