సిసి రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్
జహీరాబాద్ జనవరి 7( జనం సాక్షి)తెలంగాణలో ప్రతి గ్రామ పంచాయతీకి గ్రామ అభివృద్ధి గురించి 20 లక్షల రూపాయలు కేటాయించిన సందర్భంగా మొగుడం పల్లి మండలంలోని ఖంజాముల పూర్ గ్రామంలో నిధులతో సిసి రోడ్డు పనులు ప్రారంభించారు..ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తుల్జామ్మ గ్రామ పెద్దలు ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణలో ని అన్ని గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు .ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తుల్జామ్మ బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పార్టి సీనియర్ నాయకులు,వార్డు మెంబర్ కృష్ణ గ్రామస్తులు ప్రసాద్,పాండు,నారాయణ రెడ్డి,అంజన్న,శంకర్,రామన్న,భీమన్న తదితరులు పాల్గొన్నారు.
సిసి రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్




