సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో నిర్వహించే సేవా కార్యక్రమాలకు భక్తులు అన్నివిధాల సహకరించాలని సంఘం జాతీయ కార్యదర్శి వంకాయలపాటి శంకర్ చౌదరి కోరారు.సోమవారం జిల్లా కేంద్రంలో జరిగిన ఆ సంఘ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.తమ సంఘం ఆధ్వర్యంలో గత డిసెంబర్, జనవరి నెలల్లో అయ్యప్ప భక్తుల కొరకు నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు.అయ్యప్ప స్వామి భక్తులు ధర్మప్రచార సభ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజా ఉపయోగ కార్యక్రమాలలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రంగు ముత్యంరాజు ,సహాయ కార్యదర్శి భూపతి శ్రీనివాస్ , కోశాధికారి మాశెట్టి నరేష్ , పిఆర్ఓ రాపర్తి మహేష్ కుమార్ , కమాండెంట్ దగ్గుపాటి ఉపేందర్ ,కార్యవర్గ సభ్యులు మామిడి అరవింద్ , సురేందర్ , మొరిశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.




