Wednesday, 4 November 2026

క్రీడాకారులకు క్రీడాస్పూర్తి అవసరం: మంత్రి ధర్మాన

శ్రీకాకుళం , నవంబర్‌ 21 : క్రీడాకారులకు క్రీడాస్పూర్తి అవసరమని రాష్ట్ర రహదారులు , భవనాల శాఖామాత్యులు ధర్మా ప్రసాదరావు అన్నారు. బుధవారం ఉదయం స్థానిక కోడి రామ్మూర్తి స్టేడియంలో రాష్ట్ర స్థాయి పాఠశాల క్రీడల సమాఖ్య ఆధ్వర్యంలో  58వ అంతర జిల్లాల బ్యాడ్మెంటెన్‌  టోర్నమెంట్‌ను ఆయన లాంఛంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడ/హతూ అంతర్జాతీయ/హ స్థాయిలో పేరొంది క్రీడ బ్యాడ/-మంట/- అని అన్నారు. క్రీడలలో గెలుపు ఓటములు ప్రధానం కాదని పాల్గొడమే ముఖ్యమని పేర్కొన్నారు.  క్రీడాకారులకు క్రీడాస్పూర్తి అవసరమని అప్పుడె జయంసాధిస్తారని చెప్పారు. క్రీడాకారులకు క్రమశిక్షణ తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. రెండు భాగాలుగా పాల్గొంటున్న వి ద్యార్ధినీ విద్యార్ధులకు ( క్రీడాకారులు ) ముందుగా  అభినందనలు తెలియజేసారు. బ్యాడ్మెంటెన్‌  పోటీలో పాల్గొని జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడాకారులకు అవసరమై కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రస్థాయి పాఠశాల క్రీడల సమాఖ్యను  కోరారు. మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న  ఈ పోటీలను విజయవంతం చేయాలని చెప్పారు. మంచి అనుభవాలతో క్రీడాకారులు వెళ్లాలని ఆశీర్వదించారు. అంతకుముందు జాతీయపతాకాన్ని రాష్ట్ర రహదారులు,భవనాల శాఖామాత్యులు ధర్మా ప్రసాదరావు ఎగురవేయగా , క్రీడల పతాకాన్ని జిల్లా ఒలింపిక్‌ అసోసియె/హషన్‌ అధ్యక్షులు , ధర్మా కృష్ణదాస్‌ ఎగురవేశారు. అనంతరం రాష్ట్రంలో 21 జిల్లాల నుండి వచ్చి క్రీడాకారులతో మార్చ్‌ఫాస్ట్‌ నిర్వహించారు. అనంతరం శ్రీకాకుళం పురపాలక సంఘం మాజీ అద్యక్షురాలు   మెంటాడ వెంకట పద్మావతి క్రీడాజ్యోతిని వెలిగించి క్రీడలనుప్రారంభించారు. జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌  అధ్యక్షులు  ధర్మా కృష్ణదాస్‌ మాట్లాడుతూ ఈ టోర్నమెంట్‌ను అత్యంత వైభవంగా ప్రారంభించడానికి కృషిచేసి నిర్వాహకులకు ముందుగా అభినందనలు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ కీడాకారుల స్పూర్తితో ముందుకు వెళ్లాలని క్రీడాకారులనుద్దెశించి అన్నారు. క్రీడాకారులకు లక్ష్యమే ముఖ్యమని చెప్పారు. గెలుపు ఓటములు ముఖ్యము కాదని మనలో ఉండె నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి వేదిక ఇదని తెలిపారు. క్రీడాకారులు జిల్లాకు మంచి పేరును తీసుకురావాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *