క్రీడా ప్రాంగణా స్థలాన్ని సర్వేచేయించిన అధికారులు
కొడకండ్ల, నవంబర్23(జనంసాక్షి):
కొడకండ్ల గ్రామంలో తహశీల్దార్ సమక్షంలో సర్వేయర్ సహకారంతో అమరవీరుల స్తూపం వెనకాల బోడతండ పోయే రోడ్డుకు తెలంగాణ క్రీడా ప్రాంగణ స్థలాన్ని సర్వే చేసి ఎంపీడీవో సురేందర్ నాయక్ సమక్షంలో సర్పంచ్ పసునూరి మధుసూదన్ కు, పంచాయతీ కార్యదర్శికి 2 ఎకరాల 20 గుంటలు స్థలం అప్పగించండం జరిగింది. ఇట్టి స్థలంలో రెండు రోజులలో క్రీడా ప్రాంగణం పనులు ప్రారంభించాలని తహశీల్దార్ గ్రామపంచాయతీకి,సర్పంచ్ ను ఆదేశించడం జరిగింది. ఈ స్థలం సర్వేలో సర్పంచ్ పసునూరి మధుసూదన్, ఇంచార్జ్ ఎంపిఓ శ్రీనివాస్, ఏపీఓ నరిగే కుమారస్వామి గౌడ్,టీ ఏ యాకయ్య, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లు, ఫీల్డ్ అసిస్టెంట్ సురేష్, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొనడం జరిగింది




