డాక్టరేట్ పట్టా పొందిన వీణవంక నివాసి
డాక్టర్ పట్టా పొందిన మోహన్ కు
మాజీ సర్పంచ్ చిన్నాల ఐలయ్య యాదవ్ హర్షం వ్యక్తం చేశారు
వీణవంక నవంబర్ 23 (జనం సాక్షి) వీణవంక మండల కేంద్రానికి చెందిన ఈదునూరి మోహన్ నిరుపేద కుటుంబంలో జన్మించాడు చిన్ననాటి నుండి చదువులో చురుకుగా ఉండేవాడు పై చదువులు చదవడానికి కొరకు హైదరాబాద్ వెళ్ళాడు ఉస్మానియా యూనివర్సిటీలో ఎం ఏ బిఈడి పి హెచ్ డి పూర్తి చేశాడు ప్రఖ్యాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ కళాశాలలో అర్థ శాస్త్రం విభాగం నుండి భారత వ్యవసాయ రంగంపై ప్రపంచీకరణ ప్రభావం తెలంగాణ రాష్ట్ర పరిస్థితులు అధ్యయనం అన్న అంశంపై ఆచార్య నకులా రెడ్డి పర్యవేక్షణలో పరిశోధన చేసి వారి చేతుల మీదుగా డాక్టరేట్ పట్టాను వీణవంక నివాసి సాధించాడు వీణవంక మాజీ సర్పంచ్ చిన్నాల ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ వీణవంక గ్రామస్తుడైన ఈదునూరి మోహన్ ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు తండ్రి ఇదినూరి మదనయ్య దినసరికి కూలి చేసుకుంటూ ఆ కూలితో వచ్చిన డబ్బులతో మోహన్ కు ఉన్నత చదువులు చదివించాడు డాక్టరేట్ పట్టా సాధించినందుకు ఈదునూరి మోహన్ కు చిన్నాల ఐలయ్య తో పాటు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు




