క్రైస్తవులకు కానుకగా దుస్తులు పంపిణీ
గుడిహత్నూర్”: డిసెంబర్,( జనం సాక్షి)తెలంగాణ ప్రభుత్వం ప్రతి కిస్మస్ పండుగకు క్రైస్తవులకు కానుకగా దుస్తులను అందిస్తుందని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి, తహశీల్దార్ సంధ్యారాణి అన్నారు మంగళవారం మండల కేంద్రంలోని మోరియా హార్వెస్ట్ చర్చిలో బోథ్ నియోజకవర్గ స్థాయి క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు అధికారులు కేక్ కట్ చేసి వేడుకలు ప్రారంభించారు అనంతరం జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిణి, తహసీల్దార్, స్థానిక సర్పంచ్ జాదవ్ సునీత లు క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు తెలంగాణ ప్రభుత్వం 2015 నుండి ప్రభుత్వం అన్ని పండుగలకు కానుకలు అందిస్తుందన్నారు
క్రిస్మస్ పర్వదినాన్ని క్రైస్తవులు ఘనంగా జరుపుకోవాలని ముందస్తుగా వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బోథ్ తహసీల్దార్ అతికొద్దీన్, ఆర్ఐ చంద్రశేఖర్, పాస్టర్లు సదానందం, రాజ్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు జాదవ్ రమేష్, వినోద్, బోథ్ విక్టరీ పోస్టర్స్ అసోసియేషన్ సభ్యులు, క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు




