మర్యాదపూర్వకంగా ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డిని కలిసిన నిమ్మరెడ్డి అశోక్ రెడ్డి
ఆత్మకూర్(ఎం) డిసెంబర్ 20 (జనంసాక్షి) పల్లెర్ల గ్రామ నివాసి నిమ్మరెడ్డి అశోక్ రెడ్డి బంజారాహిల్స్ లో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది అలాగే పల్లెర్ల గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ముఖ్యంగా సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు నిలిచిపోయిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ ముదిరాజ్ సంఘం భవన్ స్త్రీశక్తి భవన్ గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దానికి తను సానుకూలంగా స్పందించి వెంటనే సిసి రోడ్లు గురించి ఆరా తీయడం జరిగింది పల్లెర్ల గ్రామానికి 25 లక్షల రూపాయలు మంజూరు చేశానని చెప్పడం జరిగింది పెండింగ్ ఉన్న సీసీ రోడ్లను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు అతి త్వరలో పల్లెర్ల చిలకనగర్ లో సిసి రోడ్లు పూర్తి చేయాలని చెప్పడం జరిగింది మిగతావి కూడా త్వరలోనే నిధులు మంజూరు చేస్తానని గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలపై పర్యటిస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా నిమ్మ రెడ్డి అశోక్ రెడ్డి ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేయడం తెలిపారు




