ముత్యాలమ్మ గుడి నిర్మాణానికి విరాళం అందజేత
ఆత్మకూర్(ఎం) డిసెంబర్ 20 (జనంసాక్షి) పల్లెర్ల గ్రామంలో మాల సంఘం వారు నిర్మిస్తున్న ముత్యాలమ్మ గుడి నిర్మాణం కోసం ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మరియు టెస్కబ్ వైస్ చైర్మన్ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి 61,000 రూపాయలు పల్లెర్ల గ్రామ సర్పంచ్ నాయిని నర్సింహారెడ్డి 40,000 వేల రూపాయలు మొత్తం కలిపి ఒక లక్ష వెయ్యి 101016 రూపాయలు మాల సంఘం వారికి ఇవ్వడం జరిగింది అనంతరం గొంగిడి మహేందర్ రెడ్డిని సన్మానించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎస్సి సెల్ మండల అధ్యక్షుడు మేడి శ్రీనివాస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సామ నరేందర్ రెడ్డి పార్టీ నాయకులు మాజీ సెక్రటరీ జనరల్ కంబాలపల్లి సురేందర్ భవన కార్మిక సంఘం అధ్యక్షుడు జన్నపాల శేఖర్ మాల సంఘం అధ్యక్షులు వంగపల్లి యాదయ్య వంగపల్లి నరేష్ వంగపల్లి అర్జున్ వంగపల్లి బాల నర్సయ్య తుంగ యాదగిరి నర్సయ్య శ్రీను బిక్షపతి నరసయ్య మాల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు




